తాజాగా ఓ కుక్క వీడియో తెగ వైరల్ అవుతుంది..అది అందరు అనుకున్న విధంగా మామూలు కుక్క కాదు..ఒకసారి ఏదైనా చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తుంది..ఆ కుక్క డ్రైవింగ్ ను చూస్తె షాకవ్వాల్సిందె..ప్రొఫిషనల్ డ్రైవర్ కూడా పనికి రారు అనే చెప్పాలి.తన యజమాని ఎలా చెప్పాడో అలా ఆకుక్క డ్రైవింగ్ చేసింది.కుక్క తెలివికి మెచ్చుకుంటున్నారు.విక్టోరియాలోని హామిల్టన్ కు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చాడు. ఆ కుక్క కూడా చాలా అద్భుతంగా డ్రైవింగ్ నేర్చుకుంది. అదేంటి కుక్క హైట్ కు డ్రైవింగ్ ఎలా సాధ్యపడుతుందా? అని చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది.
ఆ కుక్కకు యాక్సిలరేటర్, ఇంకా బ్రేక్ అందకపోయినా కానీ స్టీరింగ్ ను మాత్రం చాలా బాగా కంట్రోల్ చేస్తుంది.వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్రైవింగ్ మాత్రమే కాదండోయ్.. ఈ కుక్క గొర్రెల కాపరిగా కూడా ఇరగదీసిందట. ఇలా డ్రైవింగ్ నేర్చుకుని ట్రక్ నడిపే కంటే ముందు ఈ కుక్క గొర్రెల కాపరిగా పని చేసేదట. కుక్క గొర్రెల కాపరిగా పని చేసినపుడు ఒక్క గొర్రెను కూడా మంద నుంచి బయటకు పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించేదని ఆ యజమాని చెబుతున్నాడు. కుక్క తెలివితేటలతో తాను ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నానని ఆ యజమాని అంటున్నారు.ఆ వీడియో పై మీరు ఒక లుక్ వేసుకోండి..