
ఇప్పటివరకు ఎంతోమంది జనాలు అటు శీర్షాసనం వేయడం గురించి విన్నాము. కానీ ఏకంగా ఒక భారీ ఏనుగు శీర్షాసనం వేసింది అంటే నమ్ముతారా.. ఏ ఊరుకోండి గురు.. ఏనుగు ఏంటి ఆసనం వేయడమేంటి.. అది కూడా శీర్షాసనం.. అది అసాధ్యం అంటారు ఎవరైనా. కానీ ఈవీడియో చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక గజరాజు శీర్షాసనం వేసింది. ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వైరల్ గా మారిపోయింది. అయితే యోగాలో భాగంగా ఏనుగు శీర్షాసనం వేయలేదు.
రోజువారి స్నానంలో భాగంగా శీర్షాసనం వేసింది ఆ భారీ గజరాజు. ఒక మావటి వాడు ఏనుగుకు ఒక పైపుతో నీళ్లు కొడుతూ స్నానం చేయిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే స్నానం చేసేందుకు వీలుగా ఆ ఏనుగు శీర్షాసనం వేసింది అని చెప్పాలి. ఎలాంటి ఆధారం లేకుండానే తన తొండాన్ని నేలకు ఆనించి ఇక తలను కూడా కాస్త నేలకు తాకించి తన వెనుక ఉన్న రెండు కాళ్ళను పైకి లేపింది ఏనుగు. ఇందుకు సంబంధించిన దృశ్యం చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. మనుషులే అనుకున్న ఇప్పుడు ఏనుగులు కూడా శీర్షాసనం వేస్తున్నాయి కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.