అంబానీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా అంబానీ ఇంట ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నాయంటే పెద్ద హంగామా చేస్తూ ఉంటారు. చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు కూడా వస్తూ ఉంటారు. ఇటీవలే తన కుమారుడు పెళ్లి కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రీ వెడ్డింగ్ ల కోసమే 1000 కోట్లకు పైగా ఖర్చులు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు మరో 1000 కోట్లతో పెళ్లి కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెళ్లికూతురు అయిన రాధిక పైనే అందరి కళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ధరించిన దుస్తులు ఆభరణాల విషయంపైనే అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు.


తాజాగా రాధిక మర్చంట్ ధరించిన నీలిరంగు వజ్రాల ఓపెన్ నెక్లెస్ అందరినీ ఆకట్టుకుంటోంది. మూడవ రోజున  విహారయాత్ర భాగంగా నౌకలో అంబానీ విహారయాత్రని సైతం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇది కేన్స్ నగరానికి చేరుకోబోతోంది. అలాగే ఈరోజుకి టు క్యాచ్ ఏ దిఫ్లో చూపించిన ఒక అద్భుతమైన కోటకి చేరుకోబోతున్నారట. ఈ ఈవెంట్ ఒక వండర్ గా ఉండబోతోంది. రాధిక మర్చంట్ వేర్సాస్ దుస్తులలో కనిపించబోతోందట .నీలిరంగు షెడ్స్ తో కూడిన దుస్తులు ధరించబోతున్నట్లు తెలుస్తోంది.


ఇలాంటి నీలిరంగు నేపథ్యాన్ని కోరడానికి గల ముఖ్య కారణం ఇటీవలే రాధిక మాట్లాడుతూ రొమాంటిక్గా యవ్వనంగా కనిపించాలని ఇలా తను నీలిరంగుని ధరించానని తెలియజేస్తోంది. తన మెడలో లోరైన్స్ స్క్వార్టు రూపొందించిన నీలిరంగు నెక్లెస్ అలంకరించడం తనకు చాలా ఆనందంగా కలిగిందని తెలియజేస్తోంది. తన జాతకరీత్యా ఈ నీలిరంగు రాతిని ఎంపిక చేసుకున్నట్లుగా తెలియజేసింది రాధిక మర్చంట్. క్యాన్సిల్ లోని అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుక మాత్రమే కాదని వైభవం, శృంగారం, మాయాజాలంతో నిండిన వారి ప్రేమ కథకు కూడా ఇది నిదర్శనం అంటే తెలియజేసింది. అయితే ఈమె ధరించిన ఆ నీలిరంగు ఖరీదు నక్లెస్ సుమారుగా రూ .25 కోట్ల రూపాయలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: