అసలే ఎండాకాలం.. పైగా ఎక్కడ చూసినా కరెంటు కోతలు.  మరీ ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా కరెంటు తీసేస్తున్నారు . చిన్న పిల్లలు వృద్దులు ఉన్నవాళ్లు ఇళ్లల్లో పడుకోవడానికి చాలా చాలా కష్టంగా మారిపోతుంది . మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో నిత్యం కరెంటు కోతలు విధిస్తున్నారు అని జనాలు ఉక్కపోతకు తట్టుకోలేక కొంతమంది ఇళ్ల ముందు మంచాలు వేసుకొని నిద్రపోతూ ఉంటే మరి కొంత మంది మాత్రం ఏకంగా ఏటీఎం సెంటర్స్ ని వాడేసుకుంటున్నారు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఎండాకాలం ఉక్కు తట్టుకోలేక ఏసీ ఫ్యాన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు . అయితే చిన్నపిల్లలు వృద్ధులు ఉన్న ఇళ్లల్లో పరిస్థితి ఎండాకాలం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు . సడన్గా బాగా నిద్రిస్తున్న మూమెంట్లో కరెంటు పోతే ఒళ్ళు మండిపోతుంది . ఎవరైనా సరే కరెంటు తీసిన వాళ్ళని నానా బూతులు తిడుతూ ఉంటారు . అయితే ఒకటి రెండు రోజులైతే పర్వాలేదు కంటిన్యూగా అలాగే కరెంటు పోతూ ఉంటే ..ఉక్క పోత తట్టుకోలేకపోతే .. కొత్త కొత్త ఐడియాలు వస్తాయి.  అలాంటి ఐడియా ని ఇంప్లిమెంట్ చేశారు ఉత్తరప్రదేశ్ జనాలు.

రాత్రిపూట కరెంటు తీస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న గవర్నమెంట్ కి చెక్ పెడుతూ ఓ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది . రాత్రి వేళ్లల్లో  కరెంటు తీసేసి పిల్లలను నిద్రపోనికుండా చేస్తున్నారు అని ఓ కుటుంబం ఏకంగా ఏటీఎం సెంటర్లని వాడేసుకున్నారు.  ఏటీఎంలో చల్లగా ఉంటుంది అని ఆ గాలికి పిల్లలు హ్యాపీగా నిద్రపోతారు అని ఓ కుటుంబం ఇలాంటి డెసిషన్ తీసుకుంది.  తరచూ కరెంటు తీసేస్తూ పిల్లల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు అని ఆ కారణంగానే ఇలా ఏటీఎంలో చల్లగా ఉంటుంది పిల్లల నిద్రపోతారు అని ఇక్కడికి వచ్చి పడుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల స్పందిస్తున్నారు . కొందరు వెరీ గుడ్ మంచి పని చేశారు అంటూ ఉంటే మరి కొందరు ఇలాగే కంటిన్యూ అయితే ఏటీఎం సెంటర్లు ఫుల్ అయిపోతాయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఆడాళ్లు మీకు జోహార్లు అంటూ సినిమాటిక్ డైలాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు..!


మరింత సమాచారం తెలుసుకోండి: