దేశంలో మరోసారి కరోనా మహమ్మారి తీవ్ర ఉగ్రరూపం దాల్చుతుంది . తన కొరలు చాస్తూ అందరిని అటాక్ చేస్తుంది.  ఇప్పటికే వెయ్యకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి.  దీనిపట్ల ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. కరోనా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది . మాస్కులు కంపల్సరీ అని ..మాస్కులు లేకుండా బయట తిరగదు అని .. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ..గర్భిణీ స్త్రీలు.. ముసలి వాళ్లు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు అని. అవసరం ఉంటే తప్పిస్తే అనవసరంగా బయట తిరగదు అని ఎక్కడ గుంపులు గుంపులుగా తిరగదు అంటూ చెప్పుకొస్తుంది.


అంతేకాదు చిన్న జలుబు - దగ్గు - జ్వరం వచ్చిన వెంటనే కరోనా టెస్టులు చేయించుకుని పాజిటివ్ వస్తే క్వారంటైన్ అయిపోవాలి అంటూ సూచిస్తుంది . ఇలాంటి మూమెంట్లోనే మరో 15 రోజుల్లో స్కూల్ లు రీ  ఓపెన్ కాబోతున్నాయి.  ఒకవేళ అనుకున్న తేదీ స్కూల్స్ రీ ఓపెన్ చేస్తే పిల్లలు స్కూల్స్ కి వెళ్తే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఈ క్రమంలోనే  సమ్మర్ హాలిడేస్ ను మరో మూడు వారాల పాటు పెంచితే బాగుంటుంది అంటూ ఆలోచిస్తున్నారు. ఈ లోపు కరోనా కేసులు తగ్గు ముఖం పట్టొచ్చు అంటూ వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. .



ఇదే క్రమంలో మరీ ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న నార్త్ స్టేట్స్ లో సమ్మర్ హాలిడేస్ ను ఎక్స్టెండ్ చేయాలి అంటూ ఆలోచిస్తుందట ప్రభుత్వం . అంతేకాదు ఇప్పుడున్న పొజిషన్స్ కి స్కూల్ లు ఓపెన్ చేస్తే కచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లో భరించలేక స్కూల్స్ కి పంపించేస్తారు . అదే మూమెంట్లో పిల్లలు స్నాక్స్ షేర్ చేసుకోవడం .. పరిశుభ్రత పాటించకపోవడం లాంటివి చేస్తే కచ్చితంగా పిల్లలకి కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది . అది సివియర్ అయితే దేశం అల్ల కల్లోలంగా మారిపోతుంది . ఆ కారణంగానే నార్త్ స్టేట్ లో ఉండే అన్ని స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ ను మరో 3 వారాలపాటు ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో ఉన్నారట.



దీనిపై త్వరలోనే ఓ నిర్ణయానికి రాబోతుంది ప్రభుత్వం అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరొకపక్క తల్లిదండ్రుల వాదన మాత్రం మరోలా ఉంది.  ఇప్పటికే హాలిడేస్ అంటూ ఇంట్లో పిల్లలని భరించలేకపోతున్నామని ఎక్కువ టీవీలు ..లాప్ టాప్ లు.. ట్యాబ్ లు.. మొబైల్స్ లో గేమ్స్ ఆడుతూ ఇంట్లో రచ్చ రంబోలా చేసేస్తున్నారని .. ఇంకో మూడు వారాలు సెలవు పొడిగిస్తే మాత్రం కచ్చితంగా అది నరకంగానే మారిపోతుంది అని.. అప్పుడు మొత్తంగా రెండు నెలలకి పి గానే సెలవులు ఇచ్చిన్నట్లు అవుతుంది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు . మరి కొంత మంది మాత్రం గవర్నమెంట్ నిజంగా ఈ డెసిషన్ తీసుకుంటే మంచిది . పిల్లల ఆరోగ్యానికి మించి ఇంకేముంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త ఎక్కువగా ట్రెండ్అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: