దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళుతుంది . విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు వెళ్తుంది. కొత్త జోన్ కు అధికారులను కూడా నియమిస్తున్నారు. కొత్త జోన్ కి జూన్ లో జీఎం గా "సందీప్ మధూర్" ని  నియమించారు. ఇప్పుడు విభాగ అధిపతి పి హెచ్ ఓ డి ల నియామకంపై స్పెషల్ ఫోకస్ చేసింది.  బుధవారం  ఫైనాన్స్ విభాగ అధిపతిగా తూర్పు కోస్తా జోన్ లో పనిచేస్తున్న ఒక అధికారికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది .


ఇలా వరుస నియామకాలు చేస్తూ పనులను చక చక కంప్లీట్ చేసేస్తుంది . మిగతా విభాగాలకు సైతం కొద్ది రోజుల్లోనే పిహెచ్ ఓడీలను నియమించినట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు పీహెచ్ఓ నియామక పూర్తయిపోయిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన దక్షిణ కోస్తా కొత్త జోన్ ఏర్పాట్లపై స్పెషల్ నోటిఫికేషన్ రాబోతున్నట్లు తెలుస్తుంది.  అంటే ఆగస్టు నెల ఆఖరిలో లేకపోతే సెప్టెంబర్ తొలి వారంలో ఈ నిటిఫికేషన్ వస్తుంది అంటూ రైల్వే వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. నోటిఫికేషన్ వెలువడిన మూడు నాలుగు నెలల్లో అపాయింట్మెంట్ డే కూడా ప్రకటిస్తారు అంటూ ఉన్నతాధికారి ఒకరు ప్రముఖ మీడియా ఛానల్ కు తెలియజేశారు.



అంతేకాదు ఆ తర్వాత నుంచి దక్షిణ మధ్య దక్షిణ కోస్తా జోన్ల కార్యకలాపాలు వేరువేరుగా జరుగుతాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు . ఇవన్నీ చూస్తే దక్షిణ - కోస్తా అపాయింట్ మెంట్ డే డిసెంబర్ లేదా జనవరిలో ఉండొచ్చు అనే అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ , కమర్షియల్ భద్రత , విజిలెన్స్ , సివిల్ ఇంజనీరింగ్ , టెలికాం పర్సనల్ విభాగాలకు పిహెచ్ఓడి లని నియమించాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం దక్షిణ మధ్య రైల్వే లోని మూడు డివిజన్లతో పాటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా జోన్ లో కొంత భాగం కలిపి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పడబోతుంది అంటూ తెలుస్తుంది . ఆ విధంగా చూసుకుంటే దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న 6 డివిజన్లు ఇక మూడుకు పరిమితం అవుతాయి అని చెప్పొచ్చు. వాటిల్లో రాయచూరు - వాడి సెక్షన్ 108 క్మ్ . విష్ణుపురం - పగిడిపల్లి ..విష్ణుపురం -జాన్పహాడ్ 142 కిలోమీటర్లు.. కొండపల్లి - మెట్టుమర్రి 46 కిలోమీటర్లు అని తెలుస్తుంది..!


మరింత సమాచారం తెలుసుకోండి: