ముఖ్యంగా మూడు అంశాలను మీరు తప్పక పాటించినట్లయితే మానవ సంబంధాలను మంచిగా నిలబెట్టుకోవడమే కాదు. జీవితంలో ఎంతటి సమస్యనైనా అధిగమించి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.
సానుకూల వైఖరి: సమస్యలు ఎదురైనపుడు, మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి మీ దగ్గర ఉన్నటువంటి మార్గాలను అన్వేషించాలి. ఎలా సమస్యను పెద్దది కాకుండా సర్దిపెట్టాలో అన్న విషయం గురించి ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఇలా చేయడం వలన తప్పక మీ సమస్య తీరడమే కాకుండా మానవ సంబంధాలు కూడా పదిలంగా ఉంటాయి.
ఓపిక :ఎంతటి కష్టమైనా సరే కంగారు పడి, నిరుత్సాహ పడిపోకూడదు. ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి. సహనంగా ఉంటూ నిదానంగా నైనా సరే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
వ్యూహ రచన: సమస్య వచ్చినపుడు సతమతమవకుండా, ఇంకా చురుకుగా ఆలోచించగలగాలి. సమస్య పరిష్కరించడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికను రచించాలి. సమస్య తీవ్రతను బట్టి వ్యూహరచన ఉండాలి.
ఈ మూడు సూత్రాలు పాటిస్తే ఎటువంటి సమస్య అయినా సరే సానుకూలంగానే పరిష్కరించుకో గలరు. అలాగే మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు.