నెలసరి సమయంలో ఒళ్ళు నెప్పులు రావడం సహజం. ఈ నొప్పులను పూర్తిగా తగ్గించలేకపోయిన కొన్ని ఆహార నియమాలు పాటించడం వలన కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.అలాగే నెలసరి సమయంలో ఆడవాళ్లు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది. అలాగే వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంటే కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. 

 

నెలసరి సమయంలో పచ్చళ్ళకు దూరంగా ఉండాలి, లేకపోతే వేడి ఎక్కువయ్యి అధిక రక్తస్రావం జరిగే ప్రమాదముంటుంది.పచ్చళ్ళు తినడం వల్ల ఒంట్లో వేడి ఎక్కువ అవుతుంది. వీలయినతవరకు నెలసరి సమయంలో పచ్చళ్ళకి దూరంగా ఉండండి. డ్రైఫ్రూట్స్ తో చేసిన లడ్డులు తినడం వలన నొప్పులు కొంతవరకు తగ్గుతాయి. ( జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, ఖర్జూరం...వీటితో చేసిన లడ్డు)తరచు మజ్జిగ తాగడం వలన వేడి తగ్గుతుంది.

 

 

 

 

ఈ సమయంలో కడుపునొప్పి రావడం సహజం, కానీ వీలైనంతవరకు టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండడం మంచిది ( ఫ్యూఛర్ లో ఏ సమస్య రాకుండా ఉండడానికి)శరీరం ఎక్కువగా అలసిపోకుండా చూసుకోవాలి.మొదటి మూడు రోజులు బ్లీడింగ్ బాగా అవుతుంది కావున విశ్రాంతి అవసరం. కాఫీ, టీ తాగేవారు కొంచెం చల్లారబెట్టుకోని తాగడం మంచిది.నడుంనొప్పి ఎక్కువగా భాదిస్తుంటే నడుము కింద ఏదైనా (దిండు లేదా టవల్ లాంటిది) నడుముకి ఆనేలా పెట్టుకోని పడుకుంటే చాలా వరకు నొప్పి తగ్గుతుంది.మీరు ఒకవేళ నెలసరి సమయంలో బయటకి వెళ్లాల్సి వస్తే  మీతోపాటు సేఫ్టీ గా పాడ్స్ తీసుకునివెళ్ళండి.. అలాగే మీరు ఇంకొక విషయం మర్చిపోకూడదు క్లాత్ ని ఒక రెండుగంటలకొకసారి మారుస్తూ ఉండండి. ఎందుకంటే మీకు అలాగే మీ పక్కన కూర్చున్న వాళ్ళకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది.. అలాగే మీరు వేసుకునే బట్టలు కూడా కాటన్ వి అయితే బాగుంటుంది. మీకు కంఫర్ట్ గా ఉంటుంది.. 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: