అస్సాం లో ఒక అమ్మాయి ఆమె పేరు జన్మోని. వయసు ఇరవై సంవత్సరాలు. ఈమెకు మరియు పోలీసులకు అసలు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా. ఆమె యొక్క జీవితమే ఆ రాష్ట్ర డీఎస్పీ ని సైతం కదిలించిందంటే ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందో మనకి అర్థం అవుతుంది. లాక్ డౌన్ లో సోషల్ మీడియా చేసిన మంచి అంత ఇంత కాదు. ఆ సమయం లో  దేశంలో ఏ విషయం చోటుచేసుకున్న క్షణంలో వైరల్ అయ్యేది.

ఆలా అస్సాం రాష్ట్రం లో జన్మోని వాళ్ల తల్లి మార్కెట్ లో కూరగాయలు అమ్ముతూ ఉండేది. అయితే లాక్ డౌన్ వల్ల మార్కెట్ మూసివేయవలసి వచ్చింది. ఈ క్రమంలో జన్మని ఆ కూరగాయలు తీసుకోని ప్రతి ఇంటింటికి వెళ్లి అమ్మడం మొదలుపెట్టింది. ఆలా చేసేక్రమంలో  ఒక ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది. ఆ ఫోటో కాస్త అస్సాం పోలీసులు వద్దకు చేరింది. ఆమె యొక్క పరిస్థితి చూసిన ఆ రాష్ట్ర డిఎస్పీ పల్లవి మంజుదర్ జన్మోనికి అదిరిపోయే బహుమతి ని ఇచ్చింది.

డబ్బు ఇచ్చారని అనుకుంటే పొరపాటే జన్మోని కి ఒక టీవీఎస్ మోపెడ్ ను బహుమానంగా ఇచ్చింది. డీఎస్పీ ఇచ్చిన బహుమానాన్ని ఆనందంతో స్వీకరించింది. ఈ మోపెడ్ వల్ల ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించి కూరగాయలు అమ్ముతానని కుటుంబాన్ని అండగా ఉంటానని చెబుతుంది.

అయితే జన్మోని తల్లితండ్రులు చూస్తే కిరణ్ గగోయ్, మనమొతి. చిన్న తనంలోనే తండ్రి అనారోగ్యం పాలుకావడం తో ఆమె తల్లే కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకుంది. ఈ పరిస్థితి నడుమ జన్మోని తన చదువును మధ్యలోనే ఆపివేసింది. ఇప్పుడు కుటుంబానికే పెద్ద దిక్కుగా మారింది. సోషల్ మీడియా ద్వారా జన్మోని గురించి తెలుసుకున్న వారు తోచినంత సహాయం చేస్తున్నారు. అలాగే పోలీసులు బహూకరించి ఈ మోపెడ్ కూడా ఆమె కుటుంబానికి  ఎంతో సహాయం గా నిలువనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: