పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కు బాహుబ‌లి సినిమాలతో నే ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ప్ర‌భాస్ తెలుగు సినిమా ల తో పాటు బాలీవుడ్ లో కూడా హీరోగా చేయాల‌ని త‌న ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్ర‌భాస్ తో సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్లు కూడా మంచి మంచి క‌థ‌ల‌ను ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ప్ర‌భాస్ మాత్రం బాలీవుడ్ పై పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌డం లేదు. అందు కోసమే బాలీవుడ్ లో హీరో గా అవ‌కాశం వ‌చ్చినా.. ప్ర‌భాస్ సున్నితంగా తిర‌స్క‌రిస్తున్నాడు. అయితే ఇప్ప‌టికే ఒక బాలీవుడ్ సినిమా లో నటించాడు. ఇది చాలా మంది కి తెలియ‌దు. అంటే ఒక సినిమా లో ఫుల్ లెన్త్ రోల్ చేయ‌లేడు. కానీ గెస్ట్ పాత్ర లో కనిపించాడు.



ప్ర‌భాస్ బాలీవుడ్ లో అడుగు పెట్టింది బహుబ‌లి క‌న్న ముందే. ప్ర‌భుదేవా ద‌ర్శ‌కత్వంలో అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా 2014 లో యాక్ష‌న్ జాక్సన్ అనే యాక్ష‌న్ కామెడీ గ్యాంగ్ స్టార్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా లో హీరో అజ‌య్ దేవ‌గ‌న్ రెండు పాత్ర‌ల‌ల్లో క‌నిపిస్తారు. అయితే ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప‌ది నిముషాల పాటు క‌నిపిస్తాడు. ప్ర‌భుదేవా తో ఉన్న స‌న్నిహిత్యంతో ఈ సినిమా లో గెస్ట్ రోల్ చేయ‌డానికి ప్ర‌భాస్ ఒప్పుకున్నాడు. దీంతో యాక్ష‌న్ జాక్ష‌న్ సినిమాలో ప్ర‌భాస్ గెస్ట్ పాత్ర‌లో క‌నిపించాడు. దీంతో ప్ర‌భాస్ బాలీవుడ్ స్క్రీన్ పై క‌నిపించాల‌న్న అభిమానులు క‌ల కొంత వ‌ర‌కు తీరిన‌ట్టే అని చెప్పాలి. అయితే ప్ర‌భాస్ బాలీవుడ్ లో గెస్ట్ రోల్ కాకుండా ఫుల్ లెన్త్ పాత్ర‌ల‌లో న‌టించాల‌న్న‌ది అభిమానులు కోరిక‌. అయితే ప్ర‌స్తుతం ఒక బాలీవుడ్ నే కాకుండా యావ‌త్ దేశంలో ఉన్న అన్ని సినిమా ఇండ‌స్ట్రీల‌ను తన సినిమా ల‌తో ఊపేస్తున్నాడు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ కు తెలుగు ప్రేక్ష‌కుల తో పాటు యావ‌త్ దేశ వ్యాప్తం గా కోట్లాది సంఖ్య లో అభిమానులు ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: