ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే హీరోలతో పాటుగా హీరోయిన్లు కూడా అచ్చ తెలుగు అమ్మాయిలే ఉండేవారు. అప్పటి తెలుగు కదానాయికలు ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసారు. అంతేకాదు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అప్పట్లో అటు తమిళంకు, ఇటు హిందీకి కూడా మన తెలుగు హీరోయిన్లే బెస్ట్ హీరోయిన్లుగా రాణించే వారు. శ్రీదేవి, జయలలిత, వాణిశ్రీ వంటి ఎందరో తెలుగు హీరోయిన్లు ఇతర భాషల్లోనూ ఇక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు దొరకడం అనేది గగనంగా మారింది. కనీసం తెలుగులోనూ తెలుగు హీరోయిన్లు అంటే సరిగా పట్టించుకోని పరిస్థితి. అదృష్టం కొద్దీ ఏదో తమ ప్రతిభతో అవకాశాలు అందుకున్న తెలుగు భామలు అంజలి, ఇషా రెబ్బ కూడా సో సో గా సాగిపోతున్నారు తప్ప ఎంత ప్రయత్నించినా స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోతున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్లు అయిన సుమలత మరియు మాలశ్రి లు ఇద్దరు కూడా తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ గుర్తించదగ్గ  పాత్రల్లో నటించారు. స్టార్ హీరోయిన్లుగా సత్తా చాటారు. అయితే వీరిద్దరూ అచ్చ  తెలుగు అమ్మాయిలు కావడమే కాదు... మరో కామన్ పాయింట్ కూడా ఉంది.  

గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన సుమలత నాయుళ్ల కుటుంబంలో జన్మించారు. సినిమా లపై ఉన్న మక్కువతో మద్రాసు వెళ్లగా అక్కడ అనుకోకుండా సినిమా ఛాన్సులు రావడం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగడం టకా టక జరిగిపోయాయి. అలా తమిళ, కన్నడ సినిమాలు కూడా చాలానే చేశారు. అలా కన్నడ సినిమాలు చేస్తోన్న సమయం లోనే సుమలత  కన్నడ ఇండస్ట్రీ లో రెబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన అంబరీష్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఈ మధ్యనే అంబరీష్ మరణించిన విషయం తెలిసిందే.  

ఇక మాలాశ్రీ కూడా అచ్చ తెలుగమ్మాయే. చెన్నైలో పుట్టి పెరిగిన మాలాశ్రీ 1990 ల్లో హాట్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది.  మాలాశ్రీ ప్రేమఖైదీ, బావబావమరిది, సాహసవీరుడు సాగరకన్య వంటి పలు చిత్రాల్లో నటించి క్రేజ్ ను పెంచుకుంది. ఆ  తర్వాత కన్నడంలోకి వెళ్లి అక్కడ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి లేడీ సూపర్‌స్టార్ గా గుర్తింపు పొందారు . కన్నడ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన రామును పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యారు. అయితే కరోనా సమయం లో రాము మృతిచెందారు. అలా ఈ ఇద్దరు తెలుగు అమ్మాయిలు కూడా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సత్తా చాటి కన్నడ నటులను పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: