పల్నాడులో మరోసారి కాల్పుల కలకలం జరిగింది. మరోసారి వైసీపీ, టీడీపీ కక్షలు ఇక్కడ భగ్గుమన్నాయి. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం రేగింది. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై కాల్పులు జరిగాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో ప్రత్యర్థులు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

ఈ దాడిలో రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డికి బులెట్ గాయాలు అయ్యాయి. ఆయన్ను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా పని చేసిన వెన్న బాలకోటిరెడ్డి ప్రస్తుతం రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. పక్కా ప్లాన్ తో రాజకీయ ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాలకోటిరెడ్డిని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు పరామర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: