ఎలాంటి పర్ఫ్యూమ్ నుండి అయినా సువాసన దీర్ఘకాలం పాటు రాదు. పర్ఫ్యూమ్ ల నుండి సువాసన కేవలం కొన్ని నిమిషాల వరకే వెదజల్లుతూ ఉంటుంది. అయితే ఇలాంటివి మనం అస్సలు ఇష్టపడం. నిరంతరం సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్ కోసం మనమెంతగానో ఖర్చు చేస్తుంటాం. అయితే అది పెద్ద విషయం కాదు. ఆ సువాసన తీవ్రత కేవలం కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుందన్న వాస్తవాన్ని తప్పకుండా మీరు అంగీకరించాలి.ప్రతి ఒక్క పర్ఫ్యూమ్ బాటిల్స్ గురించి మొదటిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాటిపై ఉండే గమనికలు(నోట్స్). అవి కాలంతో పాటు మారుతుంటాయి. ఈ పర్ఫ్యూమ్ కు మూడు నోట్స్ ఉన్నాయి. టాప్ అండ్ బాటమ్ అండ్ మిడిల్. టాప్ నోట్ ఏంటంటే మీరు స్ప్రే చేసిన తర్వాత తొలి 15 నిమిషాలు వాసన పడుతుంది. ఆ తర్వాత అది మసకబారుతుంది. అదే మిడిల్ నోట్ విషయానికొస్తే అది కొన్ని గంటల వరకు ఉంటుంది. ఇక బాటమ్ నోట్ కి వస్తే ఇది రోజంతా ఉండే వాసన.కాబట్టి మీరు మంచి సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్ ఎంపిక చేసుకునేటప్పుడు మీరు టాప్ నోట్ మాత్రమే కాకుండా బాటమ్ అండ్ మిడిల్ నోట్స్ ను కూడా నిర్ధారించుకోండి. పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్ ఎలా ఉంటుందో పరీక్షించడానికి ఉత్తమ మార్గం మీ శరీరం యొక్క పల్స్ పాయింట్ల వద్ద పరీక్షించడం. మీ శరీరం యొక్క పల్స్ పాయింట్లు చెవుల వెనుక, మీ గొంతు యొక్క బేస్, మణికట్టు మీద, మీ లోపలి మోచేతులు మరియు మీ మోకాళ్ల వెనుక ఉంటాయి. ఈ భాగాలే సువాసనను తీవ్రతరం చేసేందుకు సహాయపడతాయి.మీరు మొదట చూసే సువాసన అది రోజంతా వాసన ఎలా వస్తుందో కాదు, మీ శరీర వాసన కూడా పర్ఫ్యూమ్ వాసన పడే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఒకే పర్ఫ్యూమ్ వేర్వేరు వ్యక్తులపై భిన్నంగా ఉంటుంది. కాబట్టి, మీరు అలాంటి పర్ఫ్యూమ్ ను ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవడానికి శ్యాంపిల్ తీసుకొని రోజంతా పరీక్షించండి. అన్ని పర్ఫ్యూమ్ లను ఒకేసారి ప్రయత్నించొద్దు. సువాసనలను పరీక్షించడంలో అస్సలు తొందర పడొద్దు.మీరు ఎంత ఎక్కువగా వాసన చూస్తే మంచి సువాసన ఉన్న వాటిని ఎన్నుకోవడంలో అంత గందరగోళ పడతారు. కాబట్టి ఒకేసారి మూడు పర్ఫ్యూమ్ ల కంటే ఎక్కువగా ప్రయత్నించవద్దు. మొదట లైట్ గా ఉండే సువాసనలను ప్రయత్నించండి. మీరు వేర్వేరు పర్ఫ్యూమ్ లను ప్రయత్నిస్తుంటే, ముందుగా లైట్ (తేలికైన) సువాసన వెదజల్లే వాటిని ప్రయత్నించండి. తర్వాత భారీ సువాసనలకు వెళ్లండి. మస్కీ మరియు కలప వంటివి తేలికైన సువాసనలు వెదజల్లుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: