కాలం ఏదైనా.. పొడి చర్మం కలవారికి మాత్రం పెద్ద సమస్యే.. ఎంత కాదు అనుకున్న సరే పొడి చర్మం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంత ఇబ్బందులు ఏంటి అనుకుంటున్నారా? పొడి చర్మం వల్ల చర్మంపై పొట్టు లేస్తుంది.. ముఖం నిర్జీవం అయిపోతుంది. అందుకే పొడి చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

పొడి చర్మం ఉన్నవారు స్నానానికి గోరు వెచ్చటినీళ్లు వాడాలి. షవర్‌ స్నానం జోలికి వెళ్లకూడదు. లేదంటే చర్మంపై సహజ నూనెలు, తేమ పూర్తిగా తగ్గిపోతాయి.

 

తేనెలో చక్కెర కలిపి చర్మానికి మర్దన చేసుకోవాలి.. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా తయారవుతుంది. 

 

రాత్రిపూట పడుకునే ముందు పాలలో దూదిని ముంచి ముఖం తుడుచుకోవాలి. దీని వల్ల చర్మం తాజాగా, తేమగా తయారవుతుంది.

 

రెండు చెంచాల తేనెలో మూడు చెంచాల ఆలివ్‌ నూనె, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. 

 

రెండు చెంచాల పాల పొడిలో చిటికెడు పసుపు, చెంచా తేనె కలిపి ముఖానికి  ఫేస్ ప్యాక్ వేసుకొని కొద్దిసేపయ్యాక తడి టిష్యూతో తుడిచేస్తే  సరిపోతుంది.

 

మరి ఇంకేందుకు ఆలస్యం? వెంటనే ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: