చాలా మంది బాధ పడే సమస్యల్లో ఖచ్చితంగా మొటిమలు సమస్య కూడా ఒకటి. ముఖం ఎప్పుడు క్లియర్ గా ఉండాలని అందరూ శ్రమ పడతారు. కానీ మనం తీసుకునే ఆహారం ఇంకా నిద్ర పోయే పద్దతుల బట్టి కూడా ముఖంపై పింపుల్స్ అనేవి వస్తాయి. మరికొంత మంది శరీర తత్వం బట్టి కూడా మొటిమలు ఎక్కువగా వస్తాయి. యువతలో ఈ మొటిమలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. దానికి కారణం హార్మోనల్ ఇన్ బ్యేలెన్స్ వల్ల.నెలసరి సమయం అనేది కరెక్ట్ గా ఉన్నా.. లేకపోయినా కూడా ఇలా అవుతూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన దైనందిన జీవితంలో చేసే కొన్ని పొరపాట్ల  వల్ల ఈ మొటిమలు అనేవి వస్తూంటాయి.ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్న వారికి అయితే ఎక్కువగా ఈ మొటిమలు అనేవి వస్తాయి. ముఖాన్ని ఎప్పుడూ కూడా క్లీని గా, శుభ్రంగా ఉంచుకోవాలి. అసలు మొటిమలు రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మనం నిద్రపోయే బెడ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. అలాగే ఎక్కువ రోజులు అవే ఉంచకుండా.. పది రోజులకోసారి అయినా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అనేవి శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వాటిపై కూడా బ్యాక్టీరియా ఇంకా క్రిములు అనేవి చేరి ఉంటాయి. అలాగే మనం నూనె పెట్టుకుని తలగడ మీద పడుకుంటాం. ఆ నూనె పిల్లో కవర్స్  కి కూడా అంటుకుంది. అలా రెండు మూడు రోజులకు అక్కడ బ్యాక్టీరియా ఇంకా క్రిములు అనేవి చేరతాయి.అయితే వాటిపైనే మనం పడుకుంటాం కాబట్టి.. ఆ బ్యాక్టీరియా కారణంగా కూడా మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే చాలా మంది బెడ్ మీదనే తింటూంటారు. అలా బెడ్ మీద ఆహారం అస్సలు తినకూడదు. బెడ్ మీద ఆహారం పడితే అక్కడ క్రిములు ఇంకా ఫంగల్ బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఇంకా దుప్పటి వంటి వాటిని రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: