జుట్టు రాలడాన్ని నిరోధించడానికి కొబ్బరి పాల రెమిడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి పాలతో హెయిర్ మసాజ్ ఇంకా షాంపూ తర్వాత కొబ్బరి పాలను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా ఆగిపోతుంది.మనం కొబ్బరి పాలను సాధారణంగా ఆహారంలో ఉపయోగిస్తాం. ఈ కొబ్బరి పాలు సహజమైన మాయిశ్చరైజర్. బలహీనమైన జుట్టుకు అవసరమైన పోషణను అందించడానికి కొబ్బరి పాలను ఉపయోగిస్తే చాలా మంచిది.పొడిబారడం, చివర్లు చీలిపోవడం, చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు కూడా కొబ్బరి పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక మన జుట్టుకు కొబ్బరి పాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.మీ జుట్టు కనుక వేగంగా రాలిపోతుంటే, కొబ్బరి పాలలో కొంచెం కర్పూరాన్ని కలిపి దాన్ని పేస్ట్ లా చేయండి. ఈ కొబ్బరి పాలు, కర్పూరం పేస్ట్ ను హెయిర్ ఆయిల్ లాగా తలకు బాగా పట్టించండి. దాన్ని జుట్టు మూలాలకు అప్లై చేసిన తర్వాత, కాసేపు మసాజ్ చేయండి. 1 నుండి 2 గంటల తర్వాత తేలికపాటి ఇంకా నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయండి.


మీ జుట్టు బాగా పొడిగా ఉంటే, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కండీషనర్‌కు బదులుగా కొబ్బరి పాలను జుట్టుకు అప్లై చేయండి. ఆ జుట్టు పొడిగా మారినప్పుడు జుట్టు రాలే సమస్య వస్తుంది. మీరు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కొబ్బరి పాలను అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా l మెరుపు పుంజుకుంటుంది.ఈ కొబ్బరి పాలను మీ జుట్టుకు కనీసం వారానికి రెండు సార్లు రాయండి. కొబ్బరి పాలను జుట్టుకు పట్టించి తేలికగా కాసేపు మసాజ్ చేయండి. కొబ్బరి పాలను మీ జుట్టుకు పట్టించి 1 గంట సేపు అలాగే ఉంచండి. ఆ తరువాత షాంపూ చేయటం మంచిది.ఇక నెరిసిన జుట్టు సమస్యకు కూడా కొబ్బరి పాలు అప్లై చేయటం వల్ల చాలా మేలు జరుగుతుంది. కొబ్బరి పాలను కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. ఉదయం పూట తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె, కొబ్బరి పాలు మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసి కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నెరవడం ఈజీగా ఆగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: