ఈ రోజుల్లో చాలా మంది ఎదురుకుంటున్న సమస్యల్లో జుట్టు సమస్యలు చాలా ఎక్కువ. చిన్న వయస్సులోనే జుట్టు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి.ఇంకా ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం ఇంకా అలాగే కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను వాడటం వంటి కారణాల వల్ల చిన్న వయస్సులోనే జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య వచ్చేస్తున్నాయి.ఈ సమస్యలు రాగానే ఏదో కంగారూ పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన పని లేదు. వీటికి ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. మునగ ఆకు పొడిలో జింక్,ఐరన్ ఇంకా విటమిన్ ఏ సమృద్దిగా ఉండుట వలన జుట్టు బాగా పెరగటానికి సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లు బాగా బలంగా ఉండేలా చేస్తుంది.ఇంకా పెరుగు జుట్టు మృదువుగా ఉండేలా చేసి చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు మూలాలు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.


అలాగే చిట్లిన జుట్టును కూడా రిపేర్ చేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల మునగ ఆకు పొడిని వేసి దానిలో మూడు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఒక అరగంట అలా వదిలేసి ఆ తర్వాత జుట్టు కుదుళ్లు, జుట్టు మొత్తం బాగా పట్టించాలి. ఇక పావుగంట తర్వాత రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.జుట్టు కుదుళ్లు బాగా బలంగా మరీ చుండ్రు సమస్య లేకుండా జుట్టు రాలే సమస్య లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటమే కాకుండా తెల్లజుట్టు ఇంకా చాలా నల్లగా మారుతుంది.జుట్టు సమస్యలకు ఈ ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ టిప్స్ వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలు చాలా ఈజీగా తొలగిపోతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. అనేక రకాల జుట్టు సమస్యలని ఈజీగా తరిమికొట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: