మనలో చాలా మందికి కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా మందికి కూడా కళ్ల కింద నలుపు ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య వలన మనలో చాలా మంది కూడా బాగా బాధపడుతూ ఉంటారు.కళ్ల కింద ఇలా నల్లగా ఉండడం వల్ల ముఖం  చూడడానికి కూడా అంత అందంగా కనిపించదు. ఇలా కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి.కొంతమందికి వంశపారపర్యంగా కొందరికి కళ్ల కింద నలుపు వస్తుంది. ఇంకా అలాగే ఆస్థమా ఉన్న వారిలో, ముక్కు అలర్జీలు ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆస్థమా, అలర్జీల కారణంగా వాటికి వాడే మందుల కారణంగా ముక్కు భాగంలో ఇన్ ప్లామేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది.దీని వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఎక్కువగా వస్తాయి. ఇంకా అలాగే రసాయనాలు కలిగిన క్రీములను, లోషన్ లను వాడడం వల్ల కూడా కళ్ల కింద నలుపు ఎక్కువగా వస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా కూడా కళ్ల కింద నల్లటి వలయాలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా అలాగే ఎండ కారణంగా కూడా కళ్ల కింద నలుపు వస్తుంది. నీటిని తక్కువగా తాగడం వల్ల, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల, శరీరంలో విటమిన్ సి తక్కువగా ఉండడం వల్ల కళ్ల కింద నలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది.


ఇలా కళ్ల కింద నలుపు రాకుండా ఉండాలంటే మనం మన జీవన విధానంలో ఖచ్చితంగా మార్పు చేసుకోవాలి.ప్రతి రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. ఖచ్చితంగా నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ తగినంత నిద్ర పోవాలి.ఇంకా అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఆహారాలను తీసుకోవాలి.ఇంకా ఉదయం పూట క్యారెట్, బీట్ రూట్, టమాటాలతో జ్యూస్ చేసి తీసుకోవాలి.ఇంకా అలాగే సాయంత్రం పూట బత్తాయి, కమలా పండ్లతో జ్యూస్ చేసి తీసుకోవాలి. ఇలా జ్యూస్ లను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ ఎ, సిలు లభిస్తాయి.అందువల్ల కళ్ల కింద నలుపు తగ్గుతుంది. అలాగే విటమిన్ కె ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. విటమిన్ కె అనేది ఎక్కువగా ఆకుకూరలల్లో ఉంటుంది. ప్రతి రోజూ ఆహారంలో భాగంగా ఒక ఆకుకూరను తీసుకోవాలి. ఈ ఆకుకూరలను తీసుకోవడం వల్ల కూడా కళ్ల కింద నలుపు తగ్గుతుంది. ఇంకా అలాగే ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.అధిక బరువు సమస్య నుండి వీలైనంత వరకు బయటపడాలి.ఖచ్చితంగా ఒత్తిడి దరి చేరకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల కళ్ల కింద నలుపు ఈజీగా తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: