వేసవి కాలం వచ్చేసింది. ఈ కాలంలో చాలా మంది ముఖం కూడా ఈజీగా ట్యాన్ అవుతుంది. ముఖంపై మురికి పేరుకుపోతుంది. ఆ పేరుకుపోయిన మురికి ఈజీగా పొయ్యి ముఖం టాన్ అవ్వకుండా తెల్లగా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే న్యాచురల్ ఫేస్ ప్యాక్ ని వేసుకోవాలి. మనం మన ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి అద్భుతమైన ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. దాంతో మీరు మీ చర్మ సౌందర్యాన్ని, మరింత కాంతిని తిరిగి పొందగలుగుతారు. అలాంటి ప్యాక్‌ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కొబ్బరి నూనెలో అనేక రకాల మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ కణాలకు పోషణనిస్తాయి. పసుపు, కొబ్బరి నూనె లోతుగా హైడ్రేట్ చేస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది వాపు మరియు ఎరుపును తగ్గిస్తుంది.పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన సమ్మేళనం.


పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.కొబ్బరినూనె, పసుపు కలిపిన ఫేస్ ప్యాక్ మీ ముఖానికి మెరుపునిస్తుంది. రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె, కొద్దిగా పసుపు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా మిక్స్‌ చేయాలి.. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత మీ ముఖం కడగాలి.ఈ టిప్ పాటిస్తే ముఖం పై నలుపు ఈజీగా పోతుంది.ఈ ప్యాక్ తో డల్ స్కిన్‌ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్కిన్ టోన్‌ను సమం చేస్తుంది. పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్‌లను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, పసుపులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిసి మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఈ ఫేస్ ప్యాక్‌ ఫేస్లో పగుళ్లు రాకుండా చేస్తాయి. కొబ్బరినూనె, పసుపుతో ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: