
చిరంజీవి జననం : చిత్ర పరిశ్రమలో చిరంజీవిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు. ఈయన 1955 ఆగస్టు 22వ తేదీన జన్మించారు. కథానాయకుడిగా సొంత టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల మెగాస్టార్ గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు మెగాస్టార్ చిరంజీవి. దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలు ఉన్నట్లు అంచనా. రామారావు తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన చిరంజీవి 1978 లో పునాది రాళ్లు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అయితే ముందుగా చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఎన్నో మైలు రాళ్ళ లాంటి సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి... ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో క్రేజ్ సంపాదించారు. ఇప్పటికి కూడా ఎంతో మంది యువ హీరోలకు పోటీ నిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక మధ్యలో కొన్నాళ్లపాటు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అక్కడ కలిసి రాకపోవడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
అనీషా ఆంబ్రోస్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అనీషా ఆంబ్రోస్ 1988 ఆగస్టు 22వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు పలు చిత్రాలలో నటించిన అనీషా... తనదైన నటనతో ఎంతగానో గుర్తింపు సంపాదించారు, కేవలం తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు అటు తమిళ మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అనిషా నటించి గుర్తింపు సంపాదించారు. 2019 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సెవెన్ అనే సినిమాలో నటించారు అనీషా ఆంబ్రోస్. అంతేకాకుండా పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు.
సి. మాధవ రెడ్డి జననం : తెలుగుదేశం పార్టీ కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు సి మాధవ రెడ్డి 1924 ఆగస్టు 22వ తేదీన జన్మించారు. ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపీగా 1984లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు మాధవరెడ్డి. 1952 నుంచి 57 లో 1వ లోకసభ కు, 8వ లోకసభ కు అదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా తన గళం వినిపించారు. ఇలా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య రాజకీయ నాయకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు సి మాధవ రెడ్డి.