ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. గ్రీన్ కో విద్యుత్ ప్రాజెక్టు పునఃసమీక్షతో రాష్ట్ర ఖజానాకు 3,625 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతోంది. జగన్ సర్కార్ టీడీపీ హయాంలో గ్రీన్ కో సంస్థకు కేటాయించిన 4,600 ఎకరాల భూమి రేటు రెండున్నర లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచింది. ప్రాజెక్ట్ జీవితకాలం పాటు గ్రీన్ ఎనర్జీ చార్జీల కింద రాష్ట్రానికి 3,375 కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతోంది. 
 
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్ కో సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. చంద్రబాబు హయాంలో గ్రీన్ కో సంస్థకు విద్యుత్ ప్రాజెక్ట్ ఇవ్వగా ఆ ప్రాజెక్ట్ ను కొనసాగిస్తున్నామని రెండు రోజుల క్రితం మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల గురించి దర్యాప్తునకు ఆదేశిస్తున్న వైసీపీ గ్రీన్ కో సంస్థతో మాత్రం ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: