హత్రాస్ కు చెందిన 19 ఏళ్ల దళిత బాలిక కుటుంబాన్ని కలవడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శనివారం అనుమతి ఇచ్చింది. వీరితో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఉంటారని, మొత్తం అయిదుగురికి అనుమతి ఇచ్చామని పోలీసులు చెప్పారు. హత్రాస్ లో 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ ముందు నుంచి కూడా హత్రాస్ వెళ్ళడానికి పట్టుదలగా ఉన్నారు.
ఏ శక్తి తమను ఆపలేదు అని ఆయన స్పష్టం చేసారు. కాగా రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ఆర్ జే డి నాయకుడు జయంత్ చౌదరి రేపు ఉదయం 11 గంటలకు హత్రాస్ ను సందర్శించనున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి