ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్​ యాదవ్​లపై బిహార్​ దళిత నాయకుని హత్య కేసులో ఎఫ్​ఐఆర్ నమోదైంది. వీరిద్దరితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.దళిత నాయకుడు శక్తి మాలిక్​ హత్య ఆదివారం ఉదయం జరిగింది. బైక్​పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను సొంత నివాసంలోనే తుపాకీతో కాల్చి హత్యచేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే హత్య జరిగిన తర్వాాత ఓ వీడియో వైరల్​గా మారింది. రాణిగంజ్ ఎమ్మెల్యే టికెట్ దక్కాలంటే పార్టీకి రూ. 50లక్షలు విరాళంగా ఇవ్వాలని.. లేకపోతే తనను అంతమొందిస్తానని తేజస్వీ యాదవ్ బెదిరించినట్లు ఆ వీడియోలో చెప్పారు శక్తి మాలిక్​.


హత్య కేసుకు సంబంధించి తేజస్వీ, తేజ్ ప్రతాప్​లు సహా మొత్తం ఆరుగురిపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు పూర్నియా జిల్లా ఎస్పీ విశాల్​ శర్మ తెలిపారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీపై ఈ కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: