ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఎన్నిక‌ల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో సత్తా చాటారు. నియోజ‌క‌వ‌ర్గంలో 108 పంచాతీలు ఉండ‌గా... అన్ని పంచాయ‌తీలు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా వైసీపీ ఇంత హ‌వా చాట‌లేదు. ఇక మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం విప్ పిన్మెల్లి 87 పంచాయ‌తీల‌ను వైసీపీ ఖాతాలో వేసేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

అయితే సీఎం జ‌గ‌న్ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో సైతం ఈ స్థాయి విజ‌యాలు వైసీపీకి రాలేదు. అస‌లు పులివెందుల‌లో పుంగనూరు స్థాయిలో ఏక‌గ్రీవాలు కూడా న‌మోదు కాలేదు. దీనిని బ‌ట్టి నూటికి నూరు శాతం ఫ‌లితాలు సాధించిన మంత్రి పెద్దిరెడ్డి జ‌గ‌న్ కంటే ముందు ఉన్నారంటూ వైసీపీ నేత‌లు ఆయ‌న్ను ప్ర‌శంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: