తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కోలీవుడ్ లో బీభత్సమైన క్రేజ్ వున్న స్టార్ హీరో.అజిత్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.ఇక సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో రాబడతాడు. అందుకే అజిత్ ని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటారు. ఇక 'విశ్వాసం' లాంటి మాస్ హిట్ తరువాత అజిత్ ఎన్నో అంచనాలతో చేస్తున్న సినిమా 'వాలిమై'. 'ఖాకి' ఫేమ్ హెచ్ వినోత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాని విడుదల చెయ్యబోతున్నారు. ఇక ఇటీవల వాలిమై సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.నాంగ వేర మారి అంటూ సాగే ఈ పాటని టాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. యువన్ మ్యూజిక్ సో సో గా వున్నా కాని అనురాగ్ పాడటంతో ఈ పాట యూ ట్యూబ్ లో తెగ దూసుకుపోతుంది.ఇక కేవలం గడిచిన 24 గంటల్లో ఈ పాట 9.5 మిలియన్ వ్యూస్ సాధించగా 1 మిలియన్ లైక్స్ అందుకుంది.


https://youtu.be/gjOLk0L830c

మరింత సమాచారం తెలుసుకోండి: