దేశ‌వ్యాప్తంగా గ‌త కొద్ది రోజుల నుంచి ల‌ఖింపూర్ ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపుతున్న విష‌యం విధిత‌మే. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతుల‌తో పాటు మొత్తం 9 మంది మృత్యువాత ప‌డ్డారు. ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌ను ప‌రిశీలించడానికి బ‌య‌లుదేరిన ప్రియాంక‌గాంధీని సైతం అరెస్ట్ చేసిన విష‌యం విధిత‌మే. తాజాగా ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై రేపు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ బృందం క‌లువ‌నుంది.

రాహుల్‌గాంధీతో సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు బుధ‌వారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్రప‌తి వీరికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ నాయ‌కులు రాష్ట్రప‌తికి ఫిర్యాదు చేయ‌నున్నారు. రైతుల ర‌క్తాన్ని క‌ళ్ల జూసిన వారిని వెంట‌నే శిక్షించాల‌ని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్‌. ఇప్ప‌టికే మృతి చెందిన రైతుల‌కు నివాళులు అర్పించేందుకు ప్రియాంక‌గాంధీ ల‌ఖింపూర్ చేరుకుంది. మ‌రోవైపు ప‌లు ప్రాంతాల నుంచి కిసాన్ సంఘాల‌ నాయ‌కులు రైతుల మృతిప‌ట్ల నిర‌స‌న తెలిపేందుకు  ల‌ఖింపూర్ చేరుకుంటుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో  పోలీసులు వారిని అడ్డుకున్నారు.      


మరింత సమాచారం తెలుసుకోండి: