రష్యా ఉక్రెయిన్ దేశంపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ దాడులు నాలుగో రోజుకు చేరాయి. మొదటి నుంచి దూకుడు మీద ఉన్న రష్యా.. ఈ యుద్ధం ముగించేందుకు ఉక్రెయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. యుద్ధం ఆపి శాంతి స్ధాపన కోసం చర్చలకు రావాలంటూ రష్యా చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ ఎట్టకేలకు అంగీకరించింది. అంతే కాదు.. చర్చలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ అంగీకరించినట్లు రష్యా మీడియా కూడా  వెల్లడించింది.


మరి ఈ రెండు దేశాల చర్చలు ఎక్కడ జరుగుతాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని బెలారస్‌ భూభాగంపై ఈ చర్చలు జరగనున్నాయి. అయితే.. జెలెన్‌స్కీ రష్యా చర్చలను ప్రతిపాదనను మొదట తిరస్కరించారు. తాము కూడా చర్చలకు తాము సిద్ధమేనని అంటూనే బెలారస్‌లో వద్దని మాత్రం క్లారిటీ గా చెప్పేశారు.


బెలారస్‌లోని పలు ప్రాంతాల నుంచీ కూడా రష్యా దాడి చేస్తోందన్న జెలెన్‌స్కీ.. తమపై దాడి చేయని దేశాలు ఏవైతే ఉవ్నాయో.. ఆ బందంతో చర్చలు ఆపేస్తామని చెబుతున్నారు. అయితే ఓ  పక్క ఈ చర్చలు సాగుతుండగానే అంతలోనే చర్చలకు జెలెన్‌స్కీ అంగీకరించడం ఆసక్తిరేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: