తెలంగాణలో భారీగా నియమాకాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని ఒకే తరహా పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రత్యేకించి సివిల్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఒకే పరీక్ష ద్వారా ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి  సీఎస్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఓకే అయితే.. దాదాపు ఐదు శాఖల్లో దాదాపు 2 వేల సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పరీక్షల నిర్వహణలో సమయం వృథా నివారించవచ్చు. రాత పరీక్ష , ఇంటర్వ్యూ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఏ శాఖలో చేరే విషయంలో స్వేచ్ఛ అభ్యర్థులకే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఒకే పరీక్ష నిర్వహణకు విధి విధానాల రూపొందించాలని అధికారులు నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: