తెలంగాణ ఆణిముత్యం, ప్రపంచ బాక్సింగ్ విజేత  నిఖత్ జరీన్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలకబోతోంది. ప్రపంచ విజేత టైటిల్‌ దక్కించుకున్న తర్వాత  తొలిసారిగా ఈనెల 27న సాయంత్రం సుమారు 6 గంటల కు  రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఘన స్వాగతం పలకాలని నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. టర్కీ లోని ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 KG ల విభాగంలో మన రాష్ట్రానికి చెందిన దేశం గర్వించదగ్గ యువ బాక్సర్ కుమారి నిఖత్ జరీన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన బాక్సింగ్ ఆణిముత్యం కుమారి నిఖత్ జరీన్ కు .. అలాగే సికింద్రాబాద్ కు చెందిన ఇషా సింగ్ జర్మనీ లోని సూల్ నగరం లో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్స్ సాధించి అదేరోజు రాష్ట్రానికి వస్తున్న  ఈషా సింగ్ లకు కనీవినీ ఎరుగని రీతిలో ఇతర క్రీడాకారులకు స్ఫూర్తి ని నింపేలా ఘన స్వాగతం పలకాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: