క్యాసినో వ్యవహారంలో ఈడి దర్యాప్తు కొసాగుతోంది. నాలుగు రోజుల పాటు చికోటి ప్రవీణ్ ను విచారించిన ఈడి.. ఆయన్నుంచి పలు వివరాలు సేకరించింది. చికోటి ప్రవీణ్ ఇచ్చిన వివరాలను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. చీకోటి ప్రవీణ్ ఇప్పటి వరకూ ఫైల్ చేసిన ఆదాయపు పన్ను వివరాలు సేకరించిన ఈడి.. ప్రవీణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్న కంపెనీల వివరాలపైనా ఆయన్ను ప్రశ్నించారు.


అంతే కాదు.. చికోటి ప్రవీణ్‌ స్థిర, చరాస్థుల వివరాలు సేకరించిన ఈడి.. చికోటి ప్రవీణ్ తో పాటు అతని బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరించారు. పాస్ పోర్ట్ వివరాలు తీసుకున్న ఈడి ఆధికారులు... గత 10ఏళ్ళుగా విదేశీ ప్రయాణ వివరాలు సేకరించారు. ఈ వివరాలుగా చేసుకుని విశ్లేషిస్తున్న ఈడి అధికారులకు అనేక సంచలన వాస్తవాలు తెలుస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: