జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి జగన్ సర్కారుపై మండిపడ్డారు. నేను వారానికి ఒకసారి వస్తేనే తట్టుకోలేక పోతున్నారన్న పవన్ కల్యాణ్... నన్ను పికేస్తే మళ్ళీ మొలుస్తా, తొక్కేస్తే పైకి లేస్తానంటూ సినిమా డైలాగులు చెప్పారు. ఏపార్టీకి కొమ్ము కాయను, ప్రజలకు మాత్రమే కొమ్ము కాస్తానన్న పవన్ కల్యాణ్... ఏ పార్టీకి అమ్ముడుపోయే ఖర్మ నాకు పట్టలేదన్నారు. నేను తప్పుచేస్తే నా చొక్కా పట్టుకోండన్న పవన్ కల్యాణ్.. పోరాటాలు చేస్తేనే మార్పులు వస్తాయన్నారు.


నా సినిమాలు ఆపేసినా నాకు భయం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అంబటి... కాపుల గుండెల్లో కుంపటి అని వర్ణించిన పవన్ కల్యాణ్... నాకు సినిమాలే ఆధారం, అంబటిలా కాదని ఎద్దేవా చేసారు. బాధ్యత లేకుండా మాట్లాడే వైసిపి నాయకులకు సరైన సమాధానం చెబుతానన్న పవన్ కల్యాణ్.. కాపు నేతలతో బూతులు తిట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అర్హులకు పెన్షన్లు అందటం లేదని.. విడివిడిగా పోటీ చేయడం వల్లే 2019లో వైకాపా గెలిచిందని.. అధికారం చూడని కులానికి అధికారం కావాలని పవన్ కల్యాణ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: