చంద్రబాబు ఉన్న రాజమండ్రి జైల్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. గత నెల 25న భోజనానికి వెళ్లే క్రమంలో తలుపు తీసేటప్పుడు ఖైదీల మధ్య తోపులాట జరిగింది. ఇందులో ఓ రిమాండ్‌ ఖైదీ గాయపడ్డాడు. గంజాయి కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విజయవాడ భవానీపురానికి చెందిన నవీన్‌రెడ్డిని కాకినాడ జీజీహెచ్‌కు సోమవారం తరలించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న సెల్‌ నుంచి బయటకు వస్తున్నప్పుడు గొడవ జరిగింది. నవీన్‌ అక్కడున్న సిమెంటు దిమ్మపై పడడంతో అతని ఎడమ దవడ ఎముకకు తీవ్ర గాయం అయ్యింది. ఆపరేషన్‌ కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.


అయితే.. అధికారులు ఈ విషయం బయటికి పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆపరేషన్‌ చేయాల్సినంత గాయమైతే 15 రోజుల జాప్యం జరగడానికి కారణమేంటో తెలియరాలేదు. మరోవిచిత్రం ఏంటంటే రిమాండ్‌ ఖైదీకి గాయమైన విషయం తమ దృష్టికి రాలేదని  జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌ అన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: