క్యాంప్ ఆఫీస్ పేరుతో పలు ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్ కు తరలించడం పై హైకోర్ట్ లో రిట్ పిటీషన్ దాఖలైంది. ఈ అంశంపై రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాస రావు, వలపర్ల మనోహరం హైకోర్ట్ ను ఆశ్రయించారు. ఈ రైతుల తరపున లాయర్ ఉన్నం sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ పిటీషన్ వేశారు. ఉత్తరాంధ్ర అభివృధి పేరుతో సీఎం క్యాంప్,ఇతర మంత్రులు, అధికారులు క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై లాయర్ ఉన్నం sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఇప్పటికే హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు లో కార్యాలయాల మార్పు కుదరదు అని తేల్చి చెప్పిన అంశాన్ని గుర్తు చేసిన రైతులు.. హైకోర్ట్ తీర్పులో రిట్ ఆఫ్ మండమస్ విధించింది అని పిటీషన్ లో తెలిపారు. హైకోర్ట్ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్ళినా  స్టే ఇచ్చేందుకు సుప్రీం తిరస్కరించింది అని రైతులు గుర్తు చేశారు. రాజధాని తరలించడం సాధ్యం కాక, చివరకు క్యాంప్ కార్యాలయాల పేరుతో  తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు పిటిషన్‌లో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: