ఆప్‌ అగ్రనాయకత్వంపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకప్పుడు అవినీతి, అక్రమాలపై పోరాటం చేసిన ఆప్‌.. ప్రస్తుతం నిందితుల రక్షణ కోసం పోరాటం చేస్తోందని ఎంపీ స్వాతి మలివాల్‌ అంటున్నారు. ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చామని ఎంపీ స్వాతి మలివాల్‌ గుర్తు చేశారు. 12 ఏళ్ల తర్వాత ఇపుడు తనపై జరిగిన దాడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని మాయం చేశారని ఎంపీ స్వాతి మలివాల్‌ అంటున్నారు. ఫోన్‌ ఫార్మాట్‌ చేసిన నిందితుణ్ని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా అని ఎంపీ స్వాతి మలివాల్‌ ప్రశ్నించారు.


తనపై దాడి చేసిన బిభవ్‌ కుమార్‌కు మద్దతుగా ఆప్‌ ఆందోళన జరుగుతోందని.. బిభవ్‌ కోసం చూపిస్తున్న చొరవలో కొంతైనా మనీశ్‌ సిసోదియా విషయంలో చూపి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని ఎంపీ స్వాతి మలివాల్‌ అంటున్నారు. ఆయనే గనక బయట ఉంటే తనకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని ఎంపీ స్వాతి మలివాల్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

aap