ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు ఎస్‌బీఐ అనేక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఏటీఎం కార్డు లేకుండానే నిర్దేశిత ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునే సదుపాయాన్నీ కల్పించింది. ఎస్‌బీఐ అధికారిక అప్లికేషన్ యోనో యాప్‌ను వినియోగించి కార్డు లేకుండానే ఏటీఎంలలో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం కార్డు మర్చిపోయినవారికి, ఏటీఎం కార్డు ఉపయోగించకూడదు అనుకునేవారికి ఈ సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇలా యోనో క్యాష్ ఫెసిలిటీ ఉపయోగించడం వల్ల కార్డు ద్వారా విత్‌డ్రాయల్స్‌కు ఎలాంటి చార్జీలూ పడవు. అందువల్ల ఆ చార్జీల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.

ఎలా చేయాలి..?
ఎస్‌బీఐ ఖాతా ఉన్న వినయోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ యోనో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖాతాకు చెందిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందుగా అప్లికేషన్‌ను మొబైల్‌లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏటీఎం కార్డు వాడకుండా డబ్బులు డ్రా చేసుకునేందుకు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ‘రిక్వెస్ట్ యోనో క్యాష్’ పైన క్లిక్ చేయాలి. ఎంత నగదు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో అందులో నమోదు చేయాలి. ఆ తర్వాత 6 అంకెల పిన్ సెట్ చేసుకోవాలి.  ఏటీఎంకు వెళ్లిన తర్వాత కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు క్రియేట్ చేసిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓ ఓటీపీ(వన్ టైం పాస్‌వర్డ్) వస్తుంది. ఆ నెంబరును కూడా ఎంటర్ చేస్తే నగదు విత్‌డ్రా అయిపోతుంది.

ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
యోనో యోనో క్యాష్ ద్వారా డబ్బులు డ్రా చేయాలనుకున్న వారు కొన్ని రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. లేదంటే చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఎస్‌బీఐ యోనో క్యాష్ సదుపాయం ఉన్న ఏటీఎంలో మాత్రమే ఇలా డబ్బులు డ్రా చేసుకునేందుకు వీలవుతుంది. ప్రతీ ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ సౌకర్యం లభించకపోవచ్చు. విత్‌డ్రా సమయంలో కనీసం రూ.500 నుంచి డ్రా చేయగలుగుతారు. అలాగే అత్యధికంగా రూ.10,000 మాత్రమే సింగిల్ ట్రాన్సాక్షన్‌లో డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక రోజులో గరిష్టంగా రూ.20,000 మాత్రమే తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్లీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: