పండగొస్తే ఖర్చులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖర్చులన్నీ కూడా అమాంతం ఒక్కసారిగా పెరుగుతాయి. బజారుకు వెళితే జేబులోంచి ఎంత డబ్బు ఖర్చు అయ్యిందో కూడా తెలియదు. ఏదైనా వస్తువు మీకు నచ్చితే దానిని తీసుకోవాలనే ఆలోచన వస్తుంది.కానీ దానిని తీసుకోవడానికి మన దగ్గర ఒక్కోసారి డబ్బు కూడా ఉండదు.ముఖ్యంగా బంగారు లేదా వెండి ఆభరణాలను కొనుక్కోవడంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇక అటువంటి పరిస్థితి తలెత్తితే రుణం అనేది మంచి మార్గం లా ఉంటుంది. లోన్ తీసుకున్న తర్వాత మీరు హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ రకమైన రుణాలలో గోల్డ్ లోన్ ఉత్తమమైనది. పండుగల మధ్య ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో గోల్డ్ లోన్ ఉత్తమ పాత్ర పోషిస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఏ బ్యాంకు చౌకగా బంగారు రుణం ఇస్తుందో తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే, ఖచ్చితంగా ఒకసారి బ్యాంకుల రేట్ల జాబితాను ఖచ్చితంగా చెక్ చేయండి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  7.60 నుంచి 16.81 శాతం చొప్పున ఖాతాదారులకు రుణాలు ఇస్తున్న బంగారం రుణాల జాబితాలో hdfc బ్యాంక్ ఐదో స్థానంలో ఉంది.


లోన్ మొత్తంలో 1% ఛార్జ్ ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. ఇంకా అలాగే ప్రభుత్వ బ్యాంక్ అయిన UCO బ్యాంక్ ప్రస్తుతం 7.40 శాతం నుండి 7.90 శాతం వరకు గోల్డ్ లోన్‌ను అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు కోసం, మీరు గరిష్టంగా రూ. 250 నుండి రూ. 5000 వరకు చెల్లించాలి.ప్రభుత్వ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంకు కూడా ఖాతాదారులకు చౌకగా బంగారు రుణం ఇస్తోంది. ఈ బ్యాంకు 7.5 శాతం నుంచి 7.5 శాతం వరకు బంగారు రుణాన్ని అందిస్తోంది. ఈ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజును తెలుసుకోవాలంటే మీరు బ్రాంచ్‌ని సంప్రదించాలి.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వ బ్యాంకు. ఇక్కడ మీరు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుతం 7.10 శాతం నుంచి 7.20 శాతం చొప్పున బంగారు రుణాలను ఇస్తోంది. లోన్ మొత్తంలో 0.75% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి.ప్రభుత్వ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ అతి చౌకగా బంగారు రుణం ఇస్తోంది. ఈ బ్యాంకు రేటు 7 శాతం. వినియోగదారులకు ఫ్లోటింగ్ రేటుపై 7 శాతం చొప్పున గోల్డ్ లోన్ ఇస్తోంది. గోల్డ్ లోన్ మొత్తంలో 0.56 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: