ప్రపంచ వ్యాప్తంగా బంగారం పై పెట్టుబడులు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంటాయి. దానితో బంగారం ధరలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు బంగారంపై పెట్టుబడులను కేవలం ఆర్థిక లావాదేవీలుగానే చూస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో అలా కాదు. భారతదేశంలో బంగారంలో ఆర్థిక లావాదేవీల కంటే కూడా సమాజంలో స్థాయి కోసం కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. ఇక భారతదేశంలో దాదాపుగా ఎవరి వివాహం జరిగిన ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే కొంత మంది పెళ్లిళ్లలో పెద్ద మొత్తంలో బంగారాన్ని వధువుకు , వరుడుకి పెడుతూ ఉంటారు. ఇలా భారతదేశంలో ఒక వివాహం జరిగింది అంటే పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత మంది భారతీయులు బంగారం పై పెద్ద మొత్తంలో పెట్టు బడులను కూడా పెడుతూ ఉంటారు. దానితో రోజు వారిగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలని ఆసక్తి కూడా జనాల్లో పెద్ద ఎత్తున నెలకొంటూ ఉంటుంది. ఇకపోతే గత మూడు రోజులుగా బంగారం ధరలు క్రమ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మరి ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి ..? వెండి ధరలు ఎలా ఉన్నాయి ..? అనే వివరాలను తెలుసుకుందాం.

వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడిపై దాదాపు 440 రూపాయలు పెరిగింది. దానితో ఈ రోజు హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్స్ పసిడి ధర 99330 రూపాయిలకి కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 400 రూపాయలు పెరిగి 91050 ఉంది. ఒక కేజీ వెండి ధర 1000 రూపాయలు పెరిగి 121000 రూపాయలుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: