ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పచ్చి బఠాణి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.పచ్చి బఠాణి తింటే ఎంతో పుష్టిగా ఉంటారు.ఇక పచ్చి బఠాణితో రుచికరమైన ఖీర్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.....


పచ్చి బఠాణీ ఖీర్‌ కి కావలసిన పదార్ధాలు....

పచ్చి బఠాణీలు – ఒక కప్పు;
పచ్చి కోవా – అర కప్పు;
ఆనప కాయ తురుము – ఒక కప్పు;
పంచదార – ఒక కప్పు;
పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు;
నెయ్యి – 3 టీ స్పూన్లు;
పాలు – 5 కప్పులు;
జీడిపప్పు ఇంకా బాదం పప్పులు – గుప్పెడు; ఎండు ద్రాక్ష – 15;
ఏలకుల పొడి – చిటికెడు;
కర్బూజ గింజలు – టీ స్పూను....

పచ్చి బఠాణి తయారు చేయు విధానం.....

ముందుగా పచ్చి బఠాణీలను గంటసేపు నానబెట్టి,ఆ తరువాత ఆ పచ్చి బఠాణి లను ఉడికించి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కన ఉంచాలి. ఆనపకాయ తురుముకి కొద్దిగా పాలు జత చేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్‌ రాగానే దించేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగిన తర్వాత పచ్చి బఠాణీ ముద్ద వేసి పది నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి.ఇక ఆ తరువాత ఆనపకాయ తురుము జత చేసి ఐదు నిమిషాలు కలిపి ఆ తరవాత కోవా, పాలు, పంచదార వేసి బాగా కలపాలి. ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్‌ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. ఎండాకాలం ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తింటే హాయిగా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన బఠాణి ఖీర్ ను మీరు ఇంట్లో ట్రై చెయ్యండి...ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: