అసలు ఎటు పోతుంది ఈ లోకం తీరు.. ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లు మనుషులను భయపెట్ట లేకపోతున్నాయా లేక మనిషి తాను మనిషిని అన్న విషయాన్ని మరిచిపోతున్నాడా.. ఎందుకు మనిషి ఇటీవల కాలంలో మానవ మృగం గా మారిపోతున్నాడు? నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసి ప్రతి ఒక్కరు లో ఇలాంటి ప్రశ్న తలెత్తుతోంది. మొన్నటి వరకు మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషి ఇక ఇప్పుడు మానవ మృగంలా మారిపోతున్నాడు.  ఇక కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నాడు.


 దీంతో నేటి ఆధునిక సమాజంలో కూడా ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి బయటకు పెట్ట లేని దుస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అడుగడుగునా ఆడపిల్లలు కామపు కోరల్లో చిక్కుకొని బలి అవుతూనే ఉన్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వెన్నులో వణుకు పుట్టె శిక్షలు విధించినా ఎక్కడా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. నేటి రోజుల్లో కూడా ఆడపిల్ల ఇంకా దుర్భర జీవితాన్ని గడపవలసిన దుస్థితి ఏర్పడుతోంది.


 ఇక ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా గోపాల పురం మండలం లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు లోకి వచ్చింది. మనవరాలి వయసున్న బాలికను దగ్గరికి తీసుకుని ప్రేమ చూపించాల్సింది పోయి.. ఆ వృద్ధుడు కామం తో ఊగి పోయాడు. దీంతో ఇంటిముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇక భయంతో బాలిక కేకలు వేయడంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: