ఇటీవల కాలంలో మనుషుల ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మంచి ఉద్యోగం వస్తే లేదా వ్యాపారంలో లాభాలు వస్తే బాగా సంపాదించవచ్చు అనే ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో ఉండేది. కానీ నేటి రోజుల్లో మాత్రం ఉద్యోగం వ్యాపారం కాదు అంతకంటే సులభమైన మార్గంలో డబ్బులు సంపాదించడం ఎలా అనే ఆలోచన చేస్తున్నారు ప్రతి ఒక్కరు. తద్వారా ఎంతోమంది సాటి మనుషులను మోసాలకు పాల్పడి ఇక డబ్బులు గుంజుకుని జల్సాలు చేయడానికి ఇష్టపడుతు అన్నారు. ఒక వైపు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అమాయకపు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసాలకు పాల్పడుతూ ఉంటే మరి కొంతమంది అందమైన అమ్మాయిలను ఎరగా వేసి చివరికి అందిన కాడికి దోచుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఇటీవలే కాలంలో హాని ట్రాప్ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాగా పలుకుబడి ఉన్న వారిని టార్గెట్ గా చేసుకుని ఇక అందమైన అమ్మాయిలతో వలవేస్తారు. ఈ క్రమంలోనే మాటలు కలిపి మాయ చేస్తారు. ఇక ఆ తర్వాత సమయం సందర్భం చూసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెడతారు. తద్వారా లక్షల రూపాయలు వస్తువులు చేయడం చేస్తూ ఉంటారని చెప్పాలి. ఇలా ఎంతోమంది పలుకుబడి ఉన్న వ్యక్తులను టార్గెట్గా చేసుకుని లక్షలు వసూలు చేస్తున్న ముఠాను ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు.


 కాగా ఈ ముఠా గత ఆరు నెలల కాలంలో 40 లక్షల రూపాయల వరకు హనీ ట్రాప్ కారణంగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. అయితే 8 లక్షలు ఇవ్వకపోతే రహస్యంగా తీసిన ఒక వీడియోను బయటపెడతామని ఓ ముఠా బెదిరిస్తుంది అంటూ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పక్కా ప్లానింగ్ ప్రకారం రంగంలోకి దిగిన పోలీసులు ఇక ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.ఈ క్రమంలోనే భార్యాభర్తల అయిన శాయిస్తా బషీర్, ఐజాజ్ అహ్మద్ గనిలతో పాటు జహంగీర్ అహ్మద్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అయితే ఆపదలో ఉన్నాను అంట చెప్పడంతో వారి ఇంటికి వెళ్ళాడు అధికారి. అయితే మాటలు కలిపి పడకగదిలోకి తీసుకువెళ్ళింది ఆమె. ఇక అంతలోనే లోపలికి చొరబడిన ఐజాక్, జహంగీర్ ఇద్దరినీ  కలిపి వీడియోలు తీసి.. డబ్బు ఇవ్వకపోతే వీడియోలను వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: