సాధారణంగా స్నేక్ క్యాచర్లు పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి పామునైనా సరే పట్టుకుంటారు. అయితే ఇలా పాములు పట్టుకోవడంలో ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు కొన్ని కొన్ని సార్లు విషపూరితమైన పాముకాటుకు గురై చివరికి ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతుంటుంది. ఇక ఇలాంటి వీడియోలు ఫోటోలు కూడా చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి.


 అలాంటిది కొంతమంది ఆకతాయిలు మాత్రం ఏకంగా తమను తామును హీరోలుగా ఫీల్ అవుతూ విషపూరితమైన పాములతో ఆటలాడుకోవడం చేసి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే  వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఖుషి నగర్ పరిధిలో ఉన్న లత్వ శెట్టి మార్కెట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోకి విషసర్పం చొరబడటంతో.. స్థానికులు అందరూ భయంతో స్నేక్ క్యాచర్కు  ఫోన్ చేశారు. ఇక అక్కడికి వచ్చిన యువకుడు ఏకంగా పామును పట్టుకున్నాడు.


 అయితే పామును పట్టుకోవడంతో ఆ యువకుడికి అంతంత మాత్రమే అవగాహన ఉంది అన్నది అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే విషపూరితమైన పాములు పట్టుకున్నాడు. సరే పట్టుకుని సంచిలో బంధించాడా అంటే అది లేదు. ఏకంగా పామును చేతిలో పట్టుకొని నడివీధిలో హీరోఇజం చూపించాలని అనుకున్నాడు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాము అతని చేతి పై కాటు వేసింది. అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా చేతికి కట్టుకట్టుకుని మరి ఇక పాము కాటు గురించి అక్కడున్న వారికి అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. ఇక పాము కాటు వేసిన ప్రాంతంలో విషాన్ని పీల్చి ఉమ్మి వేశాడు. అయితే చాలా సమయం కావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: