
మరి కొన్ని ఘటనల్లో చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రియమైన వారిని కోల్పోయి ఇక అరణ్య రోదనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది అని చెప్పాలి. బైక్ నడుపుతున్న వ్యక్తి చిన్నపాటి నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక వ్యక్తి బైక్ పై తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను ఎక్కించుకొని వెళ్తున్నాడు.
ఇక అదే సమయంలో చౌరస్తా వద్ద రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే అటువైపుగా వేగంగా దూసుకు వస్తుంది ఆర్టీసీ బస్సు. మరోవైపు నుంచి బైకర్ కూడా దూసుకు వచ్చాడు. అయితే బస్సును గమనించకుండా ఇక అలాగే రోడ్డు మీదికి వెళ్ళాడు. దీంతో ఈ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. కానీ అప్పటికే వేగంగా ఉన్న బస్సు ఆగలేదు. ఇక ముందుకు వచ్చిన బైకర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. భార్య, భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది అని చెప్పాలి.