
కొంతమంది డబ్బు ఆశ చూపి మోసలకు పాల్పడుతూ ఉంటే.. ఇంకొంతమంది ప్రేమగా మాట్లాడి ముగ్గులోకి దింపి చివరికి అసలు రంగు బయట పెడుతున్నారు. ఇలా మోసపోయిన వారు ఇక పోలీసులను ఆశ్రయిస్తూ న్యాయం చేయాలంటూ లబోదిబో మంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. భారీగా డబ్బు ఆశ చూపిన ఒక వ్యక్తి చేతిలో నిండా మోసపోయింది ఒక యువతి. యువతి దగ్గర నుంచి 16.4 లక్షల రూపాయలను కొట్టేశాడు ఆ కేటుగాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉంటున్న ఒక యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే ఆమె మొబైల్ కి పార్ట్ టైం జాబ్ ఉంది అంటూ ఒక మెసేజ్ వచ్చింది. ఇక భారీగా డబ్బు సంపాదించవచ్చు అని ఆ మెసేజ్ లో ఉంది. అయితే ఇక ఆ మెసేజ్ ను గుడ్డిగా నమ్మేసింది. ఈ క్రమంలోనే పెట్టుబడి కింద డబ్బు పెట్టించి.. విడతల వారిగా చివరికి 16.40 లక్షలను కొట్టేశాడు కేటుగాడు. మోసపోయానని గ్రహించిన యువతి చివరికి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి అపరిచిత మెసేజ్లను నమ్మి మోసపోవద్దు అంటూ అటు పోలీసులు సూచిస్తున్నారు.