ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఒక్కటే అదే పెరిగిపోయిన టమాటా రేటు. ఒకప్పుడు ఉల్లిపాయలు కోస్తే మాత్రమే కన్నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు టమాటో కోసిన కూడా సామాన్యులకు కన్నీళ్లు వస్తున్నాయి. టమాటా కేవలం సంపన్నుల కోసమేనేమో అన్నట్లుగా ఇప్పుడు రేట్లు కొండెక్కి కూర్చున్నాయి అని చెప్పాలి. దీంతో సామాన్యుడు టమాటా లేకుండానే రోజువారి వంటలను కానిస్తూ ఉన్నాడు. ఇక సంపన్నులు కూడా కాస్త ఆచితూచి టమాట కొనుగోలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇలా పెరిగిపోయిన టమాటా రేట్లతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో మునిగిపోతే.. అటు టమాటా రైతు మాత్రం వస్తున్న లాభాలతో సంతోషంలో ఎగిరి గంతేస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు టమాటా రేట్లు కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో.. ఈ టమాటా పై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్ తెరమీదకి వస్తూ ఉన్నాయి. ఇక ఎంతోమంది నేటిజన్స్ తమ క్రియేటివిటీకి పని చెప్పి ఇక నవ్వు తెప్పించే విధంగా మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ నిజమవుతాయా అంటే మాత్రం ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిసిన తర్వాత అవును అనే సమాధానం చెబుతారు ప్రతి ఒక్కరు.



 ఎందుకంటే పెరిగిపోయిన టమాటా ధర ఏకంగా దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. ఇద్దరిని విడదీసింది. పెరిగిన టమాట ధరలతో సామాన్యుల జేబులకు చిల్లు పడటమే కాదు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం అవుతున్నాయి అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఘటన మారింది. మధ్యప్రదేశ్ కు చెందిన సంజీవ్ టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. అయితే భార్యను అడగకుండా కూరలో రెండు టమాటాలు వేశాడు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది. ఇక ధరలు అంతలా ఉన్నప్పుడు వాడటం అవసరమా అంటూ భార్య మండిపడింది. ఇక భర్త చేసిన పనికి అలిగి కూతురుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా భార్య ఆచూకీ దొరక్క పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త.

మరింత సమాచారం తెలుసుకోండి: