వినాయక చవితి పండుగ వచ్చింది అంటే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊరువాడ అనేభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే వినాయక చవితిపూజల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టగా పూజలు చేసిన వారు చివరి రోజు అయిన నిమజ్జనం రోజు ఇక వినాయకుడిని ఎంతో ఘనంగా ఊరేగించి డీజే చప్పుళ్లు, బ్యాండ్ మధ్య ఇక డాన్సులతో  ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే చిన్నలు పెద్దలు అందరూ ఒకచోట చేరి ఇక ఈ సెలబ్రేషన్స్ లో కాలు కదిపి వినాయకుడిని ఎంతో ఘనంగా నిమజ్జనం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక యువకుడు ఇలాగే వినాయక నిమజ్జనంలో పాల్గొన్నాడు. ఎంతో సంతోషంగా డాన్సులు చేశాడు. కానీ ఆ సంతోషకరమైన క్షణమే అతనికి చివరి క్షణం అవుతుందని మాత్రం ఉహించలేకపోయాడు. ఏకంగా డాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఏం జరిగిందా అని అందరికీ అర్థం అయ్యేలోపే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది.


 శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్ లో వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ అనే 26 ఏళ్ళ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహం గా డాన్స్ చేస్తూ కనిపించిన ప్రసాద్.. కుప్పకూలడం తో అందరూ షాక్ అయ్యారు. అయితే స్నేహితులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఇక గుండెపోటుతోనే అతను చనిపోయాడు అన్న విషయాన్ని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: