సాధారణంగా ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు.. ట్రాఫిక్ అనే నరకం నుంచి తప్పించేందుకు ఎన్నో నగరాల్లో మెట్రో అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మెట్రో సదుపాయాన్ని ఉపయోగించుకొని ఎంతోమంది ట్రాఫిక్ లేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మెట్రో ప్రయాణం కాస్త కాస్లి అయినప్పటికీ రోడ్డుపై వాహనంతో వెళ్లి ట్రాఫిక్ లో ఇరుక్కోవడం కంటే ఇదే బెటర్ అనుకుంటున్నారు ఎంతోమంది. దీంతో మెట్రో కి ఆదరణ రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే అటు ఢిల్లీ మెట్రో కి ఆదరణ పెరగడం ఏమో కానీ తరచూ వార్తల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.


 ఢిల్లీ మెట్రోలో ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు వెళ్లడానికి ప్రయాణాలు చేయడం ఏమో కానీ.. ఇక చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొంతమంది. ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించేందుకు విచిత్రమైన వేషధారణతో మెట్రోలో ప్రయాణిస్తుంటే.. ఇంకొంతమంది డాన్సులు చేస్తూ ఆ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏకంగా మెట్రోలోనే దుకాణం పెట్టేసి.  రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. కాగా ఇటీవల మెట్రోలో మరో ఆసక్తికర ఘటన జరిగింది.


 దీంతో ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా ఇద్దరు ప్రయాణికులు మెట్రోలు దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఈ కొట్లాటలో ఒక వ్యక్తి ఏకంగా మరో వ్యక్తిని తన్నగా అతను కింద పడిపోయాడు. ఆ తర్వాత అతని మెడపై కాలు పెట్టి దారుణంగా నొక్కాడు ఆ వ్యక్తి   అయితే అయితే కింద పడిన పైకి లేచిన తర్వాత ఇలా కాలితో తనను తన వ్యక్తిని  కొట్టాడు. అయితే అక్కడ ఉన్న మిగతా ప్రయాణికులు వారిని ఆపేందుకు ప్రయత్నించిన వారు మాత్రం అసలు వినిపించుకోలేదు. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: