పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒంటరిగా సాగిపోతున్న ఒక జీవితానికి తోడును జత చేసేది పెళ్లి. ఏకంగా కష్టసుఖాల్లో పాలుపంచుకునేందుకు ఒక భాగస్వామిని అందించేది పెళ్లి. అంతేకాదు బంధాలు బంధుత్వాల విలువ ఏంటో తెలియజెప్పేది పెళ్లి. ఏకంగా పిల్లలను జన్మనిచ్చి.. మాటల్లో వర్ణించలేని ఒక అందమైన అనుభూతిని ఇచ్చేది పెళ్లి. ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లి గురించి, పెళ్లి బంధం యొక్క గొప్పతనం గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి.


 అయితే సాధారణంగా ఎంతో మంది అమ్మాయిలు పెళ్లి విషయంలో కోటి ఆశలు పెట్టుకుంటారు అని చెబుతూ ఉంటారు. ఇక పెళ్లయి అత్తారింట్లో కోటి ఆశలతో అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అమ్మాయిలను అనుకుంటూ ఉంటారు. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా ఇలాంటి ఊహల్లోనే ఉంటారు. ఏకంగా తమ జీవితంలోకి ఒక అందమైన, అర్థం చేసుకునే భాగస్వామిని ఆహ్వానించి ఇక జీవితం మొత్తాన్ని ఎంతో సంతోషంగా గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అబ్బాయిలు. దీంతో కొంతమంది ప్రేమించిన పెళ్లి చేసుకుంటే ఇంకొంతమంది పెద్దలు కుదిరించిన వివాహం చేసుకుంటూ ఉంటారు.



 అయితే ఇక్కడ ఒక యువకుడికి మాత్రం పెళ్లి చేసుకోవాలనే కళ కలగానే మిగిలిపోయింది. దీంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్ లోని చాంపాపేట్ వాసి 28 ఏళ్ళ నాగరాజు ఒక న్యాయవాది దగ్గర టైపిస్టుగా పనిచేస్తున్నాడు  అయితే తనకు వయసు పెరుగుతున్న ఇంకా పెళ్లి చేయడం లేదని తల్లిదండ్రులతో తరచు గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే బ్యాగులో బట్టలు సర్దుకుని బయటకు వెళ్ళాడు. అయితే మరునాడు జిల్లెల గూడ  స్పందన చెరువు వద్ద బ్యాగు ఫోన్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఏకంగా నాగరాజు మృతదేహాన్ని వెలిక్కి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: