డబ్బు డబ్బు నువ్వేం చేస్తావు అని అడిగితే.. రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను. రక్త సంబంధాలను తెంపేస్తాను అని చెప్పిందట. అయితే ఈ మాట ఎవరు చెప్పారో కానీ ప్రస్తుతం మనీ ఇలాంటిదే చేసి చూపిస్తుంది. ఏకంగా ఆరడుగుల మనిషిని ఆటాడిస్తుంది. మనీ ఏకంగా ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది. ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా పరిష్కారంగా మారిపోయింది మనీ. అంతేకాదు మనీ అటు మనిషిలో ఉన్న మానవత్వాన్ని కూడా కనుమరుగయ్యేలా చేస్తుంది.


 దీంతో ఏకంగా సాటి మనిషి విషయంలో కాస్తయినా జాలి దయా చూపించడం లేదు మనుషులు. అయితే సొంత వారి విషయంలో కూడా కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తులు అంతస్తులు కావాలి అంటూ ఏకంగా తోడబుట్టిన వారిని హత్య చేసీ ప్రాణాలను గాల్లో కలిపేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇలాంటి హత్యలకు సంబంధించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నేటి సభ్య సమాజంలో నెలకొంది.


అయితే ఇటీవల సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో ఇలాంటి ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి ఆంజనేయులుపై అతని సొంత తమ్ముడు కుమ్మరి ప్రభాకర్ విచక్షణ రహితంగా గొడ్డలితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే తీవ్ర గాయాల పాలైన ఆంజనేయులు రక్తపు మడుగులో విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే భూ తగాదాల నేపథ్యంలోనే ఇలా గొడ్డలితో తమ్ముడు ప్రభాకర్ అన్న పై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే అడ్డు వచ్చిన తండ్రిపై కూడా దాడి చేయబోయాడు ప్రభాకర్. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: