ప్రతి మనిషికి ఎప్పుడు రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా ఏదైనా డిఫరెంట్ గా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో కాకుండా బయటకు వెళ్లి రెస్టారెంట్లలో వారికి కావాల్సినవి ఆర్డర్ పెట్టుకొని తినడం చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే కొన్ని ప్రయోగాలు చేస్తూ ఏదో కొత్త రకం వంటకాలను వండుకొని తినడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక మహిళకు ఇలాంటి ఆలోచన వచ్చింది  తినడానికి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంది. దీంతో ఊహించని  విధంగా ఏకంగా మొసలి మాంసాన్ని వండుకొని తినేసింది.


 కానీ చివరికి చావు తప్పి కన్నులు లొట్ట పోయినంత పని అయింది. ఈ అరుదైన ఘటన కాంగోలోని బసం కుసులో వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల మహిళా ఇటీవల కంటి సమస్యలతో హాస్పిటల్లో చేరింది. పరీక్షలు చేసిన వైద్యులు పెక్యులర్  పెంటాస్టోమియాసిస్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇది పరాన జీవుల వల్ల కలిగే అరుదైన ఇన్ఫెక్షన్ అని వైద్యులు తేల్చారు. దాదాపు 0.4 అంగుళాల పొడవు ఉన్న పరాన్న జీవి కన్ను పొర కింద ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి దానిని తొలగించారు. కేవలం పాము జాతులలో మాత్రమే ఉండే ఈ పరాన్ని జీవి మహిళా కంట్లోకి వెళ్లి దాదాపు రెండు సంవత్సరాలపాటు ఇక కంటికి కింద భాగంలోనే ఉండిపోయింది. అలా మహిళ కంట్లోకి పరాన్న జీవి ఎలా వెళ్ళింది అనే విషయం పైన కూడా స్టడీ చేశారు. సాధారణంగా కొండచిలువ లాంటి పాములలో ఈ పరాన్న జీవులు ఎక్కువగా ఉంటాయట. అయితే కొండ చిలువ శ్వాస నాళాలలోనే  ఇవి గుడ్లు పెడుతూ ఉంటాయట. ఇక ఈ గుడ్లు కొన్ని కొన్ని సార్లు బయటకు బయటికి వచ్చి ఇక అవి కలిసినా కలుషిత ఆహారం మీద కలుషిత నీళ్లు తాగితే మానవ శరీరంలోకి కూడా ఈ పరాన్ని జీవులు వచ్చే అవకాశం ఉంటుంది  పాము మాంసాన్ని ఎక్కువగా తినేవారిలో ఈ పరాన్న జీవి ప్రవేశిస్తుంది. బాధిత మహిళా తాను పాము మాంసం తినలేదని మొసలి మాంసం తినే అలవాటు ఉన్నట్లు చెప్పింది. దీంతో మొసలి మాంసం తినే వారిలో ఇలాంటి పరాన జీవిని గుర్తించడం మొదటిసారి అంటూ వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: