
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో యువతి హత్య కేసులో ప్రియుడే నిందితుడు అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రేమ పెళ్లికి యువతీ తల్లిదండ్రులు అడ్డు చెప్పటం .. వారం రోజులుగా ప్రేయసి ఫోన్లు ఎత్తకపోవడంతో కక్ష కట్టి ప్రియుడే ఆమెను హతమార్చినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఆమెను హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని కత్తితో మెడ - గుండెమీద పొడుచుకున్నా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ ( 25 ) , రామచంద్రపురం ఠాణా బండ్లగూడలో ఉండే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రమ్య ( 23 ) మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయాన్ని రమ్య తల్లిదండ్రులకు తెలిపి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ పెళ్లి ఇష్టం లేని రమ్య తల్లిదండ్రులు రమ్యకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు.
అప్పటి నుంచి రమ్య ప్రవీణ్ దూరం పెడుతూ వస్తుంది. వారం రోజులుగా ప్రవీణ్ ఫోన్ చేసిన ఆమె స్పందించలేదు. దీంతో రగిలిపోయిన ప్రవీణ్ తనకు దక్కని రమ్య ఇంకెవరికి దక్కకూడదని ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ఉదయం రమ్య తల్లిదండ్రులు విధులకు వెళ్లినట్టు గుర్తించాడు. వెనుక వైపు నుంచి ఇంట్లోకి దూకాడు. లోపలికి వెళ్లి రమ్యతో వాగ్వివాదానికి దిగిన అనంతరం కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. తాను కూడా బతకలేనన్న ఉద్దేశంతో కత్తితో పొడిచుకున్నాడు. ఇక ప్రవీణ్ తండ్రి 20 ఏళ్ల క్రితమే మరణించాడు. తల్లి వీరితో ఉండటం లేదు. ప్రవీణ్ కు సోదరుడు నాగరాజు ఉండగా .. అతడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నతరం నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగిన ప్రవీణ్ ప్రస్తుతం ఆల్విన్ కాలనీలో ఉంటూ ట్యూషన్లు చెబుతున్నట్టు పోలీసులు విచారణలో తేలింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు